Sudheer Babu: యాక్షన్ థ్రిల్లర్ ను పట్టాలెక్కించిన యంగ్ హీరో!

  • నిరాశపరిచిన 'శ్రీదేవి సోడా సెంటర్'
  • రిలీజ్ కి రెడీగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'
  • సెట్స్  పైకి వెళ్లిన కొత్త ప్రాజెక్టు 
  • దర్శకుడిగా మహేశ్ సూరపనేని  
Sudheer Babu new movie update

మొదటి నుంచి కూడా సుధీర్ బాబు విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాడు. కొంతకాలంగా ఆయన ఒకదాని తరువాత ఒకటిగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడుగానీ, విజయాలు మాత్రం దక్కడం లేదు. ఈ మధ్య ఆయన నుంచి వచ్చిన 'శ్రీదేవి సోడా సెంటర్' కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. 

ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా సిద్ధంగా ఉంది. ఇందగ్రంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, సుధీర్ బాబు సరసన నాయికగా కృతి శెట్టి అలరించనుంది. ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతూ ఉండగానే, ఆ తరువాత సినిమాను ఆయన పట్టాలెక్కించాడు.

కెరియర్ పరంగా సుధీర్ బాబుకి ఇది 16వ సినిమా. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి, మహేశ్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీకాంత్ .. 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.

More Telugu News