Entrance Tests: తెలంగాణలో వివిధ ప్రవేశ పరీక్షల తేదీలు ఇవిగో!

Telangana higher educational council announced dates of entrance tests
  • 2022-23 సంవత్సరానికి ప్రవేశ పరీక్షలు
  • తేదీలు ఖరారు చేసిన ఉన్నత విద్యామండలి
  • డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం పరీక్షలు

నూతన విద్యా సంవత్సరం రానున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పలు ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు చేసింది. 2022-23 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సులకు సంబంధించి వివిధ సెట్ ల తేదీలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు.

లాసెట్- జులై 21 (మూడేళ్ల కోర్సు)
లాసెట్- జులై 22 (ఐదేళ్ల కోర్సు)
పీజీఎల్ సెట్- జులై 22
ఎడ్ సెట్- జులై 26, 27
ఐసెట్- జులై 27,28
పీజీఈసెట్- జులై 29 నుంచి ఆగస్టు 1 వరకు

  • Loading...

More Telugu News