Ram Gopal Varma: పునీత్ రాజ్ కుమార్ కు నివాళి అర్పించిన రామ్ గోపాల్ వర్మ.. వీడియో ఇదిగో!

Ram Gopal Varma pays tributes to Puneeth Rajkumar
  • బెంగళూరులోని పునీత్ మెమోరియల్ వద్ద నివాళి అర్పించిన వర్మ
  • ఆయనతో పాటు వెళ్లిన అప్సర, నైనా
  • రాఘవేంద్ర రాజ్ కుమార్ ను కలిసిన వర్మ

ప్రముఖ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో సినీ పరిశ్రమ షాక్ కు గురైంది. చిన్న వయసులోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. సినీ ప్రముఖులందరూ ఆయనకు ఘన నివాళి అర్పించారు.

 తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పునీత్ కు నివాళి అర్పించారు. బెంగళూరులోని పునీత్ మెమోరియల్ వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. మెమోరియల్ వద్ద రాజ్ కుమార్, ఆయన భార్య పార్వతమ్మలకు కూడా నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనతో పాటు హీరోయిన్లు అప్సర, నైనా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పునీత్ అన్న రాఘవేంద్ర రాజ్ కుమార్ ను వర్మ కలిశారు. ప్రస్తుతం కన్నడ స్టార్ ఉపేంద్రతో 'ఆర్' చిత్రాన్ని వర్మ తెరకెక్కిస్తున్నారు. 

  • Loading...

More Telugu News