Tax: ప‌న్ను క‌ట్ట‌లేద‌ని షాపులోనే చెత్త పార‌బోసిన క‌ర్నూలు మునిసిప‌ల్ సిబ్బంది

  • చెత్త ప‌న్ను వ‌సూళ్ల‌లో అధికారుల అత్యుత్సాహం
  • క‌ర్నూలు న‌గ‌రంలో షాపులోనే చెత్త‌ను పార‌బోసిన వైనం
  • గ‌తంలో షాపుల ముందు చెత్త‌ను పార‌బోసిన అధికారులు
  • వ‌రుస ఘ‌ట‌న‌ల‌తో చెత్త ప‌న్ను వ‌సూళ్ల తీరుపై విమ‌ర్శ‌లు
kurnool municipal staff threw dustin shop to non payment of tax

చెత్త ప‌న్ను వ‌సూళ్ల‌లో ఏపీ అధికార యంత్రాంగం అత్యుత్సాహం ప్ర‌దర్శిస్తూ విమ‌ర్శ‌లు కొనితెచ్చుకుంటోంది. ఏపీలో అందులోనూ క‌ర్నూలు న‌గ‌ర పాల‌క సంస్థ‌లో ఈ త‌ర‌హాలో ఓ ఘ‌ట‌న జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. చెత్త ప‌న్ను క‌ట్ట‌లేద‌ని ప‌లు షాపుల ముందు చెత్త‌ను పార‌బోసిన క‌ర్నూలు న‌గ‌ర‌పాల‌క సంస్థ సిబ్బంది..తాజాగా అదే న‌గ‌రంలో ఈసారి ఏకంగా షాపుల ముందు కాకుండా షాపులోనే చెత్త‌ను పార‌బోశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు వైర‌ల్‌గా మారిపోయాయి.

తాజా ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే.. చెత్త ప‌న్ను వసూళ్ల కోసం బ‌య‌లుదేరిన న‌గ‌ర పాల‌క సిబ్బంది.. న‌గ‌రంలోని కృష్ణా న‌గ‌ర్ ప‌రిధిలోని ప‌లు షాపుల‌కు వెళ్లారు. ఇందులో భాగంగా ఓ డెలివ‌రీ షాపు యాజమాన్యం ప‌న్ను క‌ట్ట‌లేదు. దీంతో న‌గ‌రంలో ఏరిన చెత్త‌ను అక్క‌డికి తెప్పించిన అధికారులు.. స‌ద‌రు చెత్త‌ను ఆ డెలివ‌రీ షాపులో పోశారు. షాపు యాజ‌మాన్యం ఎంత‌గా అడ్డుకున్నా.. అధికారులు ఏమాత్రం ప‌ట్టించుకోకుండా షాపులోనే చెత్త‌ను పార‌బోసి వెళ్లిపోయారు.

More Telugu News