Tina Dabi: రెండో పెళ్లి చేసుకోబోతున్న 2015 ఐఏఎస్ టాపర్ టీనా దాబీ.. కాబోయే భర్త ఎవరంటే..!

2015 IAS topper Tina Dabi engagement with Pradeep Gawande IAS
  • ఐఏఎస్ అధికారి ప్రదీప్ గవాండేను పెళ్లాడబోతున్న టీనా
  • ఎంగేజ్ మెంట్ ఫొటోలను షేర్ చేసిన టీనా, ప్రదీప్
  • అత్తర్ ఖాన్ ను తొలి వివాహం చేసుకున్న టీనా
2015 ఐఏఎస్ టాపర్ టీనా దాబీ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. 2013 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి ప్రదీప్ గవాండేను ఆమె పెళ్లాడబోతున్నారు. తమ నిశ్చితార్థం ఫొటోలను టీనా, ప్రదీప్ ఇద్దరూ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఫొటోల్లో వీరిద్దరూ చేతుల్లో చేతులు వేసుకుని, చిరునవ్వులు చిందిస్తుండటం అందరినీ ఆకట్టుకుంటోంది. 

2018లో టీనా దాబి తొలి వివాహం జరిగింది. ఐఏఎస్ అధికారి అత్తర్ ఖాన్ ను ఆమె పెళ్లాడారు. అప్పట్లో వీరి ప్రేమ, పెళ్లి గురించి దేశ వ్యాప్తంగా ఎన్నో కథనాలు వచ్చాయి. వార్తా పత్రికల్లో హెడ్ లైన్స్ లో వీరు నిలిచారు. 2015 యూపీఎస్సీ పరీక్షల్లో టీనా దాబి తొలి ర్యాంకు సాధించగా, అత్తర్ ఖాన్ రెండో ర్యాంకు సాధించారు. యూపీఎస్సీ టాపర్ గా నిలిచిన తొలి దళిత వ్యక్తిగా టీనా చరిత్ర సృష్టించారు. అంతేకాదు, ఫస్ట్ అటెంప్ట్ లోనే సివిల్స్ ను టీనా క్రాక్ చేశారు.

టీనా, అత్తర్ లకు ముస్సోరిలోని ఐఏఎస్ అకాడమీలో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ రాజస్థాన్ కేడర్ కు చెందిన వారు. వీరి పెళ్లి జమ్మూకశ్మీర్ లోని పెహల్గామ్ లో అట్టహాసంగా జరిగింది. ఢిల్లీలో జరిగిన వివాహ విందుకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎందరో సీనియర్ పొలిటీషియన్లు, అత్యున్నత అధికారులు హాజరయ్యారు. అయితే కొంత కాలం తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. తన పేరు చివరన ఖాన్ అనే పేరును ఆమె తొలగించడంతో విషయం బహిర్గతమయింది. 2021 ఆగస్ట్ 10న వీరికి జైపూర్ లోని ఫ్యామిలీ కోర్టు విడాకులను మంజూరు చేసింది.  

ఇప్పుడు ప్రదీప్ గవాండేను టీనా పెళ్లాడబోతున్నారు. టీనా కంటే ప్రదీప్ సర్వీస్ పరంగా రెండేళ్లు సీనియర్. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ ఆర్కియాలజీ మరియు మ్యూజియంల డైరెక్టర్ గా పని చేస్తున్నారు. 
Tina Dabi
IAS
Secong Marriage
Pradeep Gawande

More Telugu News