UNESCO: ఏపీ నుంచి తొలిసారి.. లేపాక్షి ఆలయానికి ‘యునెస్కో’ జాబితాలో చోటు!

  • ‘యునెస్కో’ తాత్కాలిక జాబితాలో చోటు
  • దేశం నుంచి ఎంపికైన మూడింటిలో లేపాక్షి ఒకటి
  • మరో ఆరు నెలల్లో యునెస్కో తుది జాబితా విడుదల
Lepakshi Temple placed in Unesco temporary list

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా లేపాక్షి ఆలయం అరుదైన గుర్తింపు పొందేందుకు అడుగు దూరంలో నిలిచింది. యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ఏపీ నుంచి యునెస్కోలో చోటు సంపాదించుకున్న తొలి ఆలయంగా చరిత్రకెక్కుతుంది.

ఇండియా నుంచి మొత్తం మూడు ప్రాంతాలకు యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు లభించింది. అందులో లేపాక్షి ఆలయం కూడా ఉండడం గమనార్హం. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తాత్కాలిక జాబితాలో తొలిసారి స్థానం దక్కినట్టు అయింది. మరో ఆరు నెలల్లో యునెస్కో తుది జాబితాను విడుదల చేస్తుంది. అందులో కనుక లేపాక్షి ఆలయానికి చోటు దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఆలయానికి మంచి గుర్తింపు లభిస్తుంది.

More Telugu News