TDP: 40 వసంతాల వేడుకలపై టీడీపీ ప్రకటన ఇదే

  • రేపు హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో వేడుక‌లు
  • సాయంత్రం 4 గంట‌ల‌కు మొద‌లు కానున్న వేడుక‌లు
  • అంద‌రూ ఆహ్వానితులేనంటూ టీడీపీ ప్ర‌క‌ట‌న‌
tdp formation day celebrations in ntr trust bhavan tomorrow

తెలుగు దేశం పార్టీ (టీడీపీ)ప్రారంభ‌మై 40 ఏళ్లు పూర్తి అవుతున్న సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం నాడు ఆ పార్టీ భారీగా వేడుక‌ల‌కు తెర తీసింది. ఈ వేడుక‌ల‌కు స‌న్నాహ‌కంగా సోమ‌వారం నాడు హైద‌రాబాద్‌లో పార్టీతో త‌న ప్ర‌యాణం గురించి పార్టీ సీనియ‌ర్ నేత కంభంపాటి రామ్మోహ‌న్ రావు రాసిన పుస్త‌కాన్ని పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి టీడీపీ చెందిన ప‌లువురు కీల‌క నేత‌ల‌తో పాటు ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌లు కూడా పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు.

ఇక పార్టీ ఆవిర్భావ వేడుక‌ల‌కు సంబంధించి టీడీపీ కాసేప‌టి క్రితం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక‌ల‌ను హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్ లో ఘనంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. మంగ‌ళ‌వారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న ఈ వేడుక‌ల‌కు అంద‌రూ ఆహ్వానితులేన‌ని టీడీపీ ప్ర‌క‌టించింది.

More Telugu News