ఏపీలోని పలు జిల్లాలకు వడగాడ్పుల హెచ్చరిక
- వేసవి ఆరంభంలోనే మండుతున్న ఎండలు
- పలు ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- ఎండలకు తోడు వడగాడ్పులు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల నిర్వహణ శాఖ
కృష్ణా జిల్లాలో 12 మండలాలు, విశాఖ జిల్లాలో 15, గుంటూరు జిల్లాలో 14, శ్రీకాకుళం జిల్లాలో 7, కర్నూలు జిల్లాలో 4, తూర్పు గోదావరి జిల్లాలో 3, కడప జిల్లాలో 2 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.