Jeevan Reddy: కేసీఆర్ ఇస్తానన్నది డబుల్ బెడ్రూమ్ ఇళ్లా? సింగిల్ బెడ్రూమ్ ఇళ్లా?: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Jeevan Reddy fires on KCR
  • ఇళ్ల నిర్మాణాలకు రూ. 5 లక్షలు ఇస్తామని గతంలో చెప్పారు
  • ఇప్పుడు రూ. 3 లక్షలు ఇస్తామంటున్నారు
  • ఒక ఇల్లు కట్టాలంటే రూ. 10 లక్షలు కూడా సరిపోవన్న జీవన్ రెడ్డి 
ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. పేదలకు కేసీఆర్ ఇస్తానన్నది డబుల్ బెడ్రూమ్ ఇళ్లా? లేక సింగిల్ బెడ్రూమ్ ఇళ్లా? అని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణాలకు రూ. 5 లక్షలు ఇస్తామని గతంలో చెప్పారని... ఇప్పుడు రూ. 3 లక్షలే ఇస్తామని చెపుతున్నారని విమర్శించారు. 

అసలు రూ. 3 లక్షలకు ఎక్కడైనా ఇంటి నిర్మాణం పూర్తవుతుందా? అని ఆయన ప్రశ్నించారు. ఒక ఇల్లు కట్టాలంటే రూ. 10 లక్షలు కూడా సరిపోవని అన్నారు. అలాంటప్పుడు పేదలకు సహాయాన్ని పెంచాల్సింది పోయి, తగ్గించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పేదలకు మీరు ఇచ్చిన హామీ ఇదేనా? అని జీవన్ రెడ్డి అడిగారు.
Jeevan Reddy
Congress
KCR
TRS
Double Bedroom

More Telugu News