Manipur: మణిపూర్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇక వారానికి ఐదురోజులే పనిదినాలు!

Manipur Govt announces five working days for Govt Employees
  • మణిపూర్ సీఎంగా రెండో సారి బాధ్యతలను స్వీకరించిన బీరెన్ సింగ్
  • సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని చేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు
  • ప్రభుత్వ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు
మణిపూర్ సీఎంగా రెండోసారి బాధ్యతలను స్వీకరించిన బీరెన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు వారంలో ఐదు రోజులు మాత్రమే పనిచేసేలా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మణిపూర్ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసింది. 

ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజెన్సీలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని చేయనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేసేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Manipur
Biren Singh
Govt Employees
Govt Offices
Working days
Five Working Days

More Telugu News