Jagan: పీవీ సింధును అభినందించిన జగన్

Jagan appreciates PV Sindhu
  • స్విస్ ఓపెన్ విజేతగా నిలిచిన సింధు
  • బుసానెస్ పై సింధు ఘన విజయం
  • సింధుకు దేవుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించిన జగన్

భారత షట్లర్ పీవీ సింధు స్విస్ ఓపెన్ 2022 విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా సింధును ప్రశంసించారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ... 'స్విస్ ఓపెన్ విమెన్స్ సింగిల్స్ ను గెలిచిన తెలుగు తేజం పీవీ సింధుకు హృదయపూర్వక అభినందనలు. ప్రతి ప్రయత్నంలో ఆమెకు దేవుడి ఆశీస్సులు ఉండాలి' అంటూ ఆకాంక్షించారు.  

స్విట్జర్లాండ్ లోని బాసెల్ లో జరిగిన స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో సింధు 21-16, 21-8తో థాయ్ లాండ్ కు చెందిన బుసానెన్ పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ను సింధు 49 నిమిషాల్లోనే ముగించింది. 

  • Loading...

More Telugu News