Delhi Airport: ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఎలక్ట్రిక్ పోల్ ను ఢీకొట్టిన స్పైస్ జెట్ విమానం

SpiceJet aircraft collides with pole at Delhi airport
  • ప్యాసింజర్ టెర్మినల్ నుంచి రన్ వేకు వెళ్తున్న సమయంలో ప్రమాదం
  • ఢిల్లీ నుంచి జమ్మూకు వెళ్లాల్సిన విమానం
  • ప్రయాణికుల కోసం మరో విమానం ఏర్పాటు

ఢిల్లీ విమానాశ్రయంలో ఈరోజు పెను ప్రమాదం తప్పింది. స్పైస్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ విమానాశ్రయంలోని ఓ ఎలక్ట్రిక్ పోల్ ను ఢీకొంది. ప్యాసింజర్ టెర్మినల్ నుంచి రన్ వేకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానాన్ని వెనక్కి తీస్తుండగా ప్రమాదం జరిగింది.  ప్రమాదం తర్వాత విమానాన్ని స్పైస్ జెట్ పార్కింగ్ స్థలంలోకి తీసుకెళ్లి, ఆపేశారు. 

ప్రమాదానికి గురైన విమానం ఢిల్లీ నుంచి జమ్మూకి వెళ్లాల్సి ఉంది. విమానం ప్రమాదానికి గురి కావడంతో... ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించినట్టు ఎయిర్ పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News