YS Jagan: 31లోగా జ‌గ‌న్‌కు స‌మ‌న్లు అందించాలి.. నాంప‌ల్లి ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టు ఆదేశం

  • హుజూర్ న‌గ‌ర్‌లో కోడ్ ఉల్లంఘించార‌ని జ‌గ‌న్‌పై కేసు
  • నాంప‌ల్లి ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టులో విచార‌ణ‌
  • జ‌గ‌న్‌కు ఇంకా స‌మ‌న్లే అంద‌లేద‌న్న ప్ర‌భుత్వ న్యాయ‌వాది
nampalli court orders to issue summons to jagan on or before 31st march

వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై న‌మోదైన ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌న కేసుపై సోమ‌వారం నాంప‌ల్లిలోని ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ విచార‌ణ సంద‌ర్భంగా జ‌గ‌న్ ఎందుకు హాజ‌రు కాలేద‌ని న్యాయ‌మూర్తి ప్ర‌శ్నించారు.

న్యాయ‌మూర్తి ప్ర‌శ్న‌కు ఏపీ ప్ర‌భుత్వ న్యాయవాది సమాధానమిస్తూ, జ‌గ‌న్‌కు ఇంకా స‌మ‌న్లే అంద‌లేద‌ని తెలిపారు. దీంతో అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన న్యాయ‌మూర్తి ఈ నెల 31లోగా జ‌గన్‌కు స‌మ‌న్లు అంద‌జేయాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆపై విచార‌ణ‌ను వాయిదా వేశారు.

More Telugu News