Ishan Kishan: ఇషాన్ కిషన్ వీరబాదుడు... భారీ స్కోరు సాధించిన ముంబయి ఇండియన్స్

Ishan Kishan hammers Delhi Capitals bowlers as MI registered huge total
  • 48 బంతుల్లో 81 పరుగులు చేసిన కిషన్
  • 11 ఫోర్లు, 2 సిక్సర్లతో దూకుడు
  • 41 పరుగులు చేసిన రోహిత్ శర్మ
  • ముంబయి స్కోరు 20 ఓవర్లలో 177-5
  • 3 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్
ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడిన ముంబయి బ్యాటింగ్ చేపట్టగా... ఓపెనర్ ఇషాన్ కిషన్ వీరబాదుడు బాదాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి చివరి వరకు క్రీజులో నిలిచిన ఇషాన్ కిషన్ మొత్తం 48 బంతులు ఎదుర్కొని 81 పరుగులు సాధించాడు. అతడి స్కోరులో 11 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. బౌలర్ ఎవరన్నది చూడకుండా, బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా ఇషాన్ కిషన్ ఆటతీరు కొనసాగింది. 

కెప్టెన్ రోహిత్ శర్మ సైతం దూకుడు ప్రదర్శించాడు. రోహిత్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు చేశాడు. అన్మోల్ ప్రీత్ సింగ్ 8, తిలక్ వర్మ 22, కీరన్ పొలార్డ్ 3, టిమ్ డేవిడ్ 12 పరుగులు చేశారు. డేనియల్ శామ్స్ 7 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీశారు.
Ishan Kishan
Mumbai Indians
Delhi Capitals
IPL

More Telugu News