రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సమంత స్పందన
- నేడు రామ్ చరణ్ బర్త్ డే
- ఆర్ఆర్ఆర్ గ్రాండ్ సక్సెస్
- ఈసారి చెర్రీ పుట్టినరోజుకి ప్రత్యేకం
- నా ఫేవరెట్ రామ్ చరణ్ అంటూ పేర్కొన్న సామ్
ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి, అందులో రామ్ చరణ్ మతిపోయేలా నటించిన వైనం గురించి వినడం ఎంతో అద్భుతంగా ఉందని సమంత పేర్కొంది. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని తహతహలాడుతున్నానని వెల్లడించింది. ఈ అభినందనలకు నువ్వు ఎంతో అర్హుడివి అంటూ చరణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఈ ఏడాది నీకు సూపర్ హ్యాపీగా గడచిపోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ సామ్ తన పోస్టులో తెలిపింది. రామ్ చరణ్, సమంత జంటగా నటించిన రంగస్థలం చిత్రం ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.