International Flight Services: నేటి నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు... ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం

  • ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం
  • రెండేళ్లుగా నిలిచిన అంతర్జాతీయ విమాన సర్వీసులు
  • తగ్గిన కరోనా ప్రభావం
  • విమాన సర్వీసుల పునరుద్ధరణ
Aviation ministry lifts measures on International flight services

కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం కారణంగా భారత్ లో గత రెండేళ్లుగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు విధించడం తెలిసిందే. అయితే ఆ ఆంక్షలను కేంద్రం ఇటీవల ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో, నేటినుంచి భారత్ కు అంతర్జాతీయ విమాన సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి. 

విమాన సిబ్బంది ఇకపై పీపీఈ కిట్లు ధరించనక్కర్లేదని, అయితే విమానాశ్రయాల్లో, విమానాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి అని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తన తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. విమానాల్లోనూ, ఎయిర్ పోర్టుల్లోనూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేసింది. దాంతోపాటే, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో మూడు సీట్లను ఎమర్జెన్సీ అవసరాల కోసం ఖాళీగా ఉంచాలన్న నిబంధనను కూడా కేంద్రం విధించింది. 

నేటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు కేంద్రం పచ్చజెండా ఊపిన నేపథ్యంలో, ఎయిర్ లైన్స్ సంస్థలు ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

More Telugu News