నా లిటిల్ గ్రాడ్యుయేట్ కు అభినందనలు... అల్లు అర్జున్ ఆసక్తికర పోస్టు
- ఓ క్లాస్ పాసై మరో క్లాస్ కు వెళ్లిన అర్హ
- మురిసిపోయిన అల్లు అర్జున్
- ఇన్ స్టాగ్రామ్ లో స్పందన
అల్లు అర్హ స్కూల్లో ఓ క్లాస్ పాసై నెక్ట్స్ క్లాస్ కు వెళుతున్న సందర్భంగా బన్నీ ఈ పోస్టు చేసినట్టు తెలుస్తోంది. తన కుమార్తెను ముద్దుగా లిటిల్ గ్రాడ్యుయేట్ అని పిలుచుకున్నారు. అర్హ చదివే స్కూల్లో జరిగిన స్నాతకోత్సవ వేడుకకు హాజరైన అల్లు అర్జున్... స్టేజిపై తన కుమార్తెను ఓ సాధారణ తండ్రిలా ఆస్వాదిస్తూ ఎంతో మురిసిపోయారు.