టాలీవుడ్ నటులు అల్లు అర్జున్, కల్యాణ్‌రామ్ కార్ల బ్లాక్ ఫిల్మ్ తొలగింపు
- బ్లాక్ ఫిల్మ్‌లపై నిఘా పెంచిన పోలీసులు
- కల్యాణ్‌రామ్, అల్లు అర్జున్ కార్లకు రూ. 700 చొప్పున జరిమానా
- నిబంధనలు ఉల్లంఘించిన 80కిపైగా వాహనాలపై కేసులు
జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36లోని నీరూస్ చౌరస్తాలో నిన్న తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. అదే సమయంలో అటువైపు నుంచి వెళ్తున్న కల్యాణ్‌రామ్, అల్లు అర్జున్ కార్లను ఆపారు. అనంతరం వాటికున్న బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించి రూ.700 చొప్పున చలాన్లు విధించారు. అలాగే, నిబంధనలు పాటించని మరో 80కి పైగా వాహనాలపై కేసులు నమోదు చేశారు.