Amaravati: రాజ‌ధాని రైతుల‌కు సీఆర్డీఏ నోటీసులు.. స్పందించిన రైతులు

  • ప్లాట్ల రిజిస్ట్రేష‌న్‌కు రావాలని నోటీసులు
  • భూ ప‌రిహారం పూర్తి కాకుండానే ప్లాట్లెలా అంటున్న రైతులు
  • భూసంబంధిత ప‌త్రాలు చూపితేనే రిజిస్ట్రేష‌న్ అంటూ లేఖ‌లు
crda notices to amaravati farmers

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి భూములు ఇచ్చిన అన్న‌దాత‌ల‌కు సీఆర్డీఏ శ‌నివారం నోటీసులు జారీ చేసింది. రాజ‌ధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు.. ప్ర‌భుత్వం నుంచి అంద‌నున్న ప్లాట్ల‌ను రిజిస్టర్ చేసుకోవాలంటూ స‌ద‌రు నోటీసుల్లో సీఆర్డీఏ పేర్కొంది. అయితే ఈ నోటీసుల‌ను రాజ‌ధాని రైతులు తిరస్కరించారు. 

భూ సేక‌ర‌ణ ప‌రిహారం పూర్తి కాకుండానే ప్లాట్ల రిజిస్ట్రేష‌న్ ఏమిటంటూ రాజ‌ధాని రైతులు అభ్యంతరం వ్య‌క్తం చేస్తున్నారు. భూ సంబంధిత ప‌త్రాలు చూపిస్తేనే తాము ప్లాట్ల‌ను రిజిస్టర్ చేసుకుంటామ‌ని కూడా అప్పుడే రైతులు సీఆర్డీఏకు లేఖ‌లు రాశారు.  

More Telugu News