Bandla Ganesh: వైర‌ల్ ఫొటో!.. యూపీ సీఎం యోగితో బండ్ల గ‌ణేశ్‌!

bandla ganesh meets uttar pradesh cm yogi adityanath
  • యూపీ సీఎంకు బండ్ల గ్రీటింగ్స్‌
  • యోగితో క‌లిసి దిగిన ఫొటోను విడుద‌ల చేసిన బండ్ల‌
  • గ‌తంలోనూ ఇలానే ప‌లువురు నేత‌ల‌తో భేటీ
టాలీవుడ్ నిర్మాత‌, న‌టుడు బండ్ల గ‌ణేశ్‌కు జాతీయ స్థాయి రాజ‌కీయ నేత‌ల వ‌ద్ద‌ మంచి ప‌లుకుబ‌డే ఉన్న‌ట్టుంది. గ‌తంలో ప‌లువురు కీల‌క నేత‌ల‌తో ఇలా వెళ్లి అలా క‌లిసి వ‌చ్చిన ఆయ‌న తాజాగా.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు వ‌రుస‌గా రెండో సారి సీఎంగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన యోగి ఆదిత్య‌నాథ్‌తో క‌లిసి ఫొటో దిగారు. ఆ ఫొటోను కాసేప‌టి క్రితం స్వ‌యంగా బండ్ల గ‌ణేశ్ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశారు. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు వ‌రుస‌గా రెండో సారి ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన యోగి ఆదిత్య‌నాథ్‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన బండ్ల‌.. ప‌రమేశ్వ‌రుడు ఆయ‌న‌కు ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ప్ర‌సాదించాల‌ని ఆకాంక్షించారు. ఈ ఫొటోను చూసిన వారు బండ్ల గ‌ణేశ్‌ రాజకీయంగా మంచి సంబంధాలే నెర‌పుతున్నారంటూ కామెంట్ చేస్తున్నారు.
Bandla Ganesh
Yogi Adityanath
Tollywood

More Telugu News