Aadi Pinisetty: హీరోయిన్ నిక్కీ గల్రానీతో ఆది పినిశెట్టి నిశ్చితార్థం.. ఫొటోలు ఇవిగో!

Aadi Pinisetty got engaged with Nikki Galrani
  • టాలీవుడ్ లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరో ప్రేమ జంట
  • 24వ తేదీన జరిగిన ఆది, నిక్కీ గల్రానీల నిశ్చితార్థం
  • ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందన్న ఆది

టాలీవుడ్ లో మరో ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీలు వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశంపై వీరిద్దరూ అధికారికంగా స్పందించలేదు. తమకు ఎంగేజ్ మెంట్ జరిగినట్టు కాసేపటి క్రితం వీరు ప్రకటించారు. ఇది అఫీషియల్ అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 

జీవితంలో ఒకరికొకరు తోడుగా ఉండటం అత్యున్నతమైనదని ఆది పినిశెట్టి తెలిపాడు. రెండేళ్ల క్రితం తాము కలిశామని... ఇప్పుడు ఎంగేజ్ మెంట్ అయిపోయిందని చెప్పాడు. 24వ తేదీన ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని తెలిపాడు. ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు.   

  • Loading...

More Telugu News