Vijay: 'బీస్ట్' టైటిల్ ను అక్కడ అలా సెట్ చేశారు!

  • విజయ్ హీరోగా 'బీస్ట్'
  • కథానాయికగా పూజ హెగ్డే
  • నెల్సన్ దిలీప్ కుమార్ నుంచి మాస్ యాక్షన్ మూవీ   
  • ఏప్రిల్ 13వ తేదీన రిలీజ్
Beast Movie Update

విజయ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకు పండగే. అలాంటి పండుగ ఏప్రిల్ 13వ తేదీన రానుంది. తమిళంతో పాటు ఈ సినిమాను తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో  విడుదల చేయనున్నారు. ఒక్క హిందీలో తప్ప మిగతా భాషల్లో ఈ సినిమా 'బీస్ట్' టైటిల్ తోనే పలకరించనుంది.

హిందీలో మాత్రం ఈ సినిమాకి 'రా' ( RAW)  అనే టైటిల్ ను సెట్ చేశారు. ఈ టైటిల్ తోనే ఈ సినిమా అక్కడ విడుదల కానుంది. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. అనిరుధ్ అందించిన సంగీతం ఇప్పటికే జనం నుంచి మంచి మార్కులు సంపాదించుకుంది. 

విజయ్ క్రేజ్ కి తగినట్టుగానే రానున్న ఈ మాస్ యాక్షన్ మూవీలో కథానాయికగా పూజ హెగ్డే అలరించనుంది. ఈ సినిమా కోసం ఆమె అత్యధిక పారితోషికం అందుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది. 'కేజీఎఫ్ 2' వంటి క్రేజీ ప్రాజెక్టుతో పోటీపడుతూ ఈ సినిమా రంగంలోకి దిగుతుండటం విశేషం.

More Telugu News