The Kashmir Files: ద క‌శ్మీర్ ఫైల్స్ ద‌ర్శ‌కుడిపై పోలీస్ కంప్లైంట్‌

police complaint on the kashmir foles movie director
  • భోపాలీ ప‌దానికి కొత్త అర్థం చెప్పిన డైరెక్ట‌ర్‌
  • అగ్నిహోత్రిపై కేసు న‌మోదు చేయాలి
  • ముంబై పోలీసుల‌కు అందిన‌ ఫిర్యాదు

నిన్న‌టిదాకా త‌న తాజా చిత్రం ద క‌శ్మీర్ ఫైల్స్ చిత్రం ద్వారా దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లందుకుంటున్న బాలీవుడ్ డైరెక్ట‌ర్ వివేక్ అగ్నిహోత్రి ఒక్క‌సారిగా వివాదంలో కూరుకుపోయారు. భోపాలీ అనే ప‌దానికి కొత్త అర్థం చెప్పిన అగ్నిహోత్రిపై ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌గా.. తాజాగా ఆయ‌న‌పై కేసు న‌మోదు చేయాలంటూ ఏకంగా పోలీసుల‌కే ఫిర్యాదు అందింది.

ద క‌శ్మీర్ ఫైల్స్ విజ‌యానందంలో ఉన్న అగ్నిహోత్రి  తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భోపాలీ అంటే హోమో సెక్స్‌వల్ అని అర్ధమంటూ సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఘాటుగా స్పందించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా భోపాలీల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన అగ్నిహోత్రిపై కేసు న‌మోదు చేయాలంటూ ముంబై పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తార‌న్న దానిపై ఆస‌క్తి నెల‌కొంది.

  • Loading...

More Telugu News