KTR: న్యూయార్క్ వీధుల్లో చికెన్ లాగించిన కేటీఆర్... ఫొటోలు ఇవిగో!

KTR have some chicken on New York streets
  • అమెరికా పర్యటన ఫొటోలు పంచుకున్న కేటీఆర్
  • ఫైజర్ ఫార్మా కంపెనీ ప్రతినిధులతో భేటీ
  • అనంతరం న్యూయార్క్ లో విహారం
  • లెక్సింగ్టన్ అవెన్యూ వద్ద ఓ ఫుడ్ స్టాల్ లో భోజనం
  • ఎంతో బాగుంది అంటూ స్పందన

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు సంబంధించి ఆసక్తికర ఫొటోలను పంచుకున్నారు. న్యూయార్క్ నగర కోలాహలం, సందడి నడుమ గతకాలపు మధుర జ్ఞాపకాలను కొన్ని నెమరువేసుకున్నానంటూ కేటీఆర్ స్పందించారు. 

"ఫైజర్ ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సమావేశం అనంతరం న్యూయార్క్ వీధుల్లో విహరించాను. లెక్సింగ్ టన్ అవెన్యూ స్ట్రీట్-34లో ఓ ఫుడ్ స్టాల్ చూసి అక్కడ ఆగాను. చికెన్, రైస్, వేడి వేడి సాస్ తో హాయిగా ఆస్వాదించాను. ఇది ఎంతో బాగుంది... మీరు కూడా తినండి" అంటూ ట్వీట్ చేశారు.
.

  • Loading...

More Telugu News