International Flight services: అంతర్జాతీయ విమాన సర్వీసులు రేపటి నుంచి ప్రారంభం.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఇవే!

International flight services to resume form tomorrow
  • సిబ్బందికి పూర్తి స్థాయి పీపీఈ కిట్ అవసరం లేదు. 
  • విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది నిర్వహించే పాట్ డౌన్ సోదాలు మళ్లీ ప్రారంభం.  
  • విమానాశ్రయం లేదా విమానంలో మాస్క్ ధరించడం మాత్రం తప్పనిసరి. 

కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రేపటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. 

కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు ఇవే:

  • సిబ్బందికి పూర్తి స్థాయి పీపీఈ కిట్ అవసరం లేదు. 
  • విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది నిర్వహించే పాట్ డౌన్ సోదాలు మళ్లీ ప్రారంభం. 
  • అంతర్జాతీయ విమానాలలో 3 సీట్లను ఖాళీగా ఉంచడంపై పరిమితి ఎత్తివేత. 
  • విమానాశ్రయం లేదా విమానంలో మాస్క్ ధరించడం మాత్రం తప్పనిసరి. 

కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణికుల విమానయాన సంస్థల నిర్వహణను భారత ప్రభుత్వం నిలిపివేసింది. వ్యాక్సినేషన్ వల్ల కరోనా మహమ్మారి కట్డడిలోకి వచ్చింది. దీంతో, మళ్లీ సర్వీసులను భారత ప్రభుత్వం పునఃప్రారంభిస్తోంది.

  • Loading...

More Telugu News