Roja: కాణిపాకం ఆలయానికి గోమాతను బహూకరించిన ఎమ్మెల్యే రోజా

Roja donates holy cow to Kanipakam temple
  • కాణిపాకం ఆలయాన్ని సందర్శించిన రోజా
  • స్వామివారికి పూజలు
  • తన జన్మనక్షత్రం పేరిట ఉన్న వృక్షానికి ప్రత్యేక పూజలు

వైసీపీ ఎమ్మెల్యే రోజా చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతేకాకుండా, ఆలయానికి ఓ గోమాతను కూడా బహూకరించారు. 

అనంతరం ఆలయానికి వెనుకభాగంలో ఉన్న నక్షత్ర వనంలో తన జన్మనక్షత్రం పేరు మీద ఉన్న వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు రోజా ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆమె పంచుకున్నారు. కాగా, ఆలయ మర్యాదలను అనుసరించి రోజాకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.

  • Loading...

More Telugu News