Yogi Adityanath: ముస్లిం నేతకు కేబినెట్ లో చోటిచ్చిన యోగి ఆదిత్యనాథ్

  • రెండో సారి సీఎంగా బాధ్యతలను స్వీకరించిన యోగి
  • 52 మంది మంత్రులతో జంబో కేబినెట్ ఏర్పాటు
  • డానిష్ అజాద్ అన్సారీకి మంత్రిగా అవకాశం
Muslim leader gets berth in Yogi cabinet

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి ఎకానా స్టేడియంలో యోగి ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు, బీహార్ సీఎం నితీశ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

మరోవైపు యోగితో పాటు మరో 52 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కేశవ్ ప్రసాద్ మౌర్య డిప్యూటీ సీఎంగా మరోసారి బాధ్యతలు స్వీకరించారు. ఒక ముస్లింకు కూడా యోగి కేబినెట్ లో బెర్త్ దక్కింది. డానిష్ అజాద్ అన్సారీకి మంత్రిగా అవకాశం లభించింది. మరోవైపు 37 ఏళ్లుగా యూపీకి రెండోసారి సీఎం అయిన వారు లేరు. ఈ రికార్డును యోగి బద్దలు కొట్టారు.  

  • Loading...

More Telugu News