Tollywood: ఇది ‘ఆర్ఆర్ఆర్’ కాలం.. సినిమాపై తెలుగు స్టార్ హీరోలు, డైరెక్టర్ల స్పందన

Tollywood Heroes and Directors Response
  • సినిమా మాస్టర్ పీస్ అంటూ వరుణ్ తేజ్ ట్వీట్
  • బ్లాక్ బస్టర్ అన్న సాయిధరమ్ తేజ్
  • ‘ఫ్యాన్’టాబ్యులస్ అంటూ హరీశ్ శంకర్ ప్రశంస
ప్రేక్షకులను ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెగ అలరిస్తోంది. థియేటర్ల వద్ద అభిమానుల రచ్చ మామూలుగా లేదు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సూపర్బ్ అంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగు స్టార్ హీరోలు, డైరెక్టర్లు సినిమాపై స్పందించారు. అదుర్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

ఆర్ఆర్ఆర్ కాలం నడుస్తోందని, సినిమా ఓ మాస్టర్ పీస్ అని వరుణ్ తేజ్ అన్నాడు. ‘లోడ్, ఎయిమ్, షూట్’ అంటూ కామెంట్ చేశాడు. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసిన సాయిధరమ్ తేజ్.. బ్లాక్ బస్టర్ అంటూ ఒక్క ముక్కలో తన రివ్యూ చెప్పాడు. 

డైరెక్టర్ హరీశ్ శంకర్ తనదైన శైలిలో స్పందించాడు. ‘ఫ్యాన్’టాబ్యులస్, ‘ఫ్యాన్’టాస్టిక్ అని అన్నాడు. దిమ్మతిరిగిపోయేలా ‘ఆర్ఆర్ఆర్’ ఉందంటూ కామెంట్ చేసిన అతడు.. భారతీయ సినిమాను గర్వపడేలా చేసిన డైరెక్టర్ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు శుభాకాంక్షలు అని చెప్పాడు. 

'ఇదో ఎపిక్' అంటూ మలయాళ నటుడు టొవినో థామస్ అన్నాడు. రాజమౌళి, తారక్, రామ్ చరణ్ లకు శుభాకాంక్షలు తెలిపాడు. సినిమా గురించి మంచి టాక్ వినిపిస్తోందని శ్రీకాంత్ అన్నాడు. రాజమౌళి, తారక్, రామ్ చరణ్, డీవీవీ దానయ్యలకు శుభాకాంక్షలు తెలియజేశాడు. సినిమా సక్సెస్ కావాలంటూ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఆకాంక్షించాడు.
Tollywood
Sai Dharam Tej
Varun Tej
Harish Shankar
RRR
Junior NTR
Ramcharan
Rajamouli

More Telugu News