RRR: అమెరికాలో ట్రెండ్​ సెట్​ చేసిన ‘ఆర్​ఆర్​ఆర్’​.. ప్రీమియర్స్​ లో రికార్డ్​ వసూళ్లు.. ఎంతంటే..!

RRR Sets Trend In USA Box Office Premieres
  • నిన్న రాత్రి 7.45 గంటల వరకు 3 మిలియన్ డాలర్లు
  • ఆ మార్కు అందుకున్న తొలి తెలుగు సినిమాగా రికార్డు
  • ఇంకా పెరిగే చాన్స్ ఉందన్న ట్రేడ్ విశ్లేషకులు
బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ ప్రభంజనం మామూలుగా లేదు. మన దేశంతో పాటు విదేశాల్లోనూ దుమ్మురేపుతోంది. అభిమానులు వేల రూపాయలు ఖర్చు పెట్టి మరీ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు చూస్తున్నారు. అమెరికాలోనూ బొమ్మ మామూలుగా లేదు. నిన్న రాత్రి నుంచే అక్కడ ప్రీమియర్ లు మొదలయ్యాయి. 

అమెరికాలో సినిమా విడుదలైన 981 చోట్ల.. నిన్న రాత్రి 7.45 గంటల వరకు 30,00,127 డాలర్ల (3 మిలియన్ డాలర్లు.. సుమారు రూ.22.85 కోట్లు) వసూళ్లను రాబట్టింది. తద్వారా ప్రీమియర్ షోల ద్వారా మూడు మిలియన్ డాలర్లు రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా ఆర్ఆర్ఆర్ ట్రెండ్ సెట్ చేసింది. సరిగమ సినిమాస్ ఈ లెక్కలను వెల్లడించింది. 

ప్రీమియర్స్ కు సంబంధించి పూర్తి లెక్కలు తెలిస్తే.. వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లోనే తొలి రోజు వసూళ్లు రూ.100 కోట్లు దాటొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.
RRR
Rajamouli
Ramcharan
Jr NTR
USA

More Telugu News