Apple: ఐఫోన్ కొనడం ఎంతో ఈజీ.. త్వరలో నెలవారీ చెల్లింపుల పథకం!

  • నెలకు కొంత చెల్లిస్తే చాలు
  • ఏటేటా కొత్త ఐఫోన్ కు మారిపోవచ్చు
  • ఐప్యాడ్, ఇతర ఉత్పత్తులకూ ఈ విధానం
  • ఈ ఏడాది చివర్లోగా ప్రారంభించే అవకాశం
Apple may soon start selling iPhones through monthly subscriptions

యాపిల్ ఐఫోన్ కొనడం అంటే కొంచెం ఖరీదైన వ్యవహారం. ప్రీమియం ఫోన్ కు ఎంత లేదన్నా రూ.50 వేలకు పైనే పెట్టుకోవాలి. ఐఫోన్ ను అందరూ కొనుగోలు చేయలేకపోవచ్చు. కానీ, ఒక్కసారైనా వాడాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. ఫైనాన్స్ లో నెలవారీ ఈఎంఐ రూపంలో కొనుగోలు చేసుకునే మార్గం ఒకటి ఉంది. అయితే రుణం అందరికీ లభించదుగా. అన్నింటికీ పరిష్కారంగా యాపిల్ కంపెనీయే నెలవారీ చందా నమూనాతో కొనుగోలుదారుల ముందుకు రానున్నట్టు సమాచారం.

ఐఫోన్, ఐప్యాడ్, ఇతర హార్డ్ వేర్ ఉత్పత్తులను సబ్ స్క్రిప్షన్ విధానంలో యాపిల్ విక్రయించనుందని బ్లూంబర్గ్ కథనం ద్వారా తెలుస్తోంది. సబ్ స్క్రిప్షన్ సర్వీస్ ఇంకా అభివృద్ధి దశలో ఉందని, ఈ ఏడాది ద్వితీయ భాగంలో దీన్ని ప్రారంభించనుందని తెలుస్తోంది. ఈ విధానంలో కొనుగోలు చేసిన కస్టమర్లు నెలవారీ యాప్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.  టెలికం కంపెనీలకు నెలవారీగా చందా చెల్లించినట్టుగా. 

ఇప్పటి వరకు సబ్ స్క్రిప్షన్ సేవలు యాపిల్ మ్యూజిక్, ఐ క్లౌడ్, యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ ఫిట్ నెస్ ప్లస్, యాపిల్ ఆర్కేడ్ వంటి సాఫ్ట్ వేర్ సర్వీసులకే అమల్లో ఉన్నాయి. ఒక ఐఫోన్ ధరను 12 నుంచి 24 నెలలకు వసూలు చేసే మాదిరిగా ఈ సబ్ స్క్రిప్షన్ విధానం ఉండదని బ్లూంబర్గ్ పేర్కొంది. ఏటా విడుదల చేసే కొత్త ఐఫోన్ సిరీస్ కు మారిపోవచ్చు. పాత డివైజ్ తీసుకుని కొత్త మోడల్ డివైజ్ ను యాపిల్ అందిస్తుంది. నెలవారీగా కస్టమర్ ఎంత చెల్లించాలన్నది కంపెనీ నిర్ణయిస్తుంది. ఈ సేవను యాపిల్ ఆవిష్కరిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది.

More Telugu News