Ram Gopal Varma: కన్నడ స్టార్ తో 'ఆర్' మూవీని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ

  • ఉపేంద్ర హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్న వర్మ
  • యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రం
  • భయంకరమైన గ్యాంగ్ స్టర్ పాత్రను పోషిస్తున్న ఉపేంద్ర
Ram Gopal Varma new movie R with Upendra

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సినిమాను ప్రకటించారు. ఈ సారి ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు ఆర్జీవీ రాబోతున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సినిమాకు ఒక కన్నడ స్టార్ హీరోను ఎంచుకున్నారు. ఆయన ఎవరో కాదు... ఉపేంద్ర. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'ఆర్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించి రెండు గ్లింప్స్ లను వర్మ రిలీజ్ చేశారు. ఒక భయంకరమైన గ్యాంగ్ స్టర్ పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఏ స్క్వేర్ ప్రొడక్షన్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది.

More Telugu News