The Kashmir Files: రికార్డులే రికార్డులు.. 14 రోజుల్లోనే రూ. 200 కోట్లు వసూలు చేసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’

  • 14వ రోజున రూ. 7.50 కోట్ల వసూళ్లు
  • రెండు వారాల్లో రూ. 206 కోట్లు రాబట్టిన ది కశ్మీర్ ఫైల్స్
  • కరోనా తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు
The Kashmir Files box office collection Day 14

వివేక్ అగ్నిహోత్రి ఫిల్మ్ ‘ది కశ్మీర్ ఫైల్స్’ రికార్డులు బద్దలుగొడుతూనే ఉంది. ఈ నెల 23 నాటికి రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా 14వ రోజున ఏకంగా రూ. 7 కోట్లకుపైగా వసూలు చేసింది. ఫలితంగా ఆ సినిమా ఇప్పటి వరకు సాధించిన మొత్తం వసూళ్లు రూ. 206 కోట్లకు చేరుకున్నాయి. 

1990లలో కశ్మీర్ ఉగ్రవాదుల అకృత్యాల నేపథ్యంలో సాగిన హిందువుల వలసల ఆధారంగా రూపొందించిన ఈ సినిమా ఈ నెల 11న విడులైంది. అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి తదితరులు నటించారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ది కశ్మీర్ ఫైల్స్ బాక్సీఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. 

కేవలం వారం రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కును దాటిన ఈ సినిమా ఇప్పుడు రూ. 200 కోట్లను కొల్లగొట్టడం ద్వారా గత రికార్డులను బద్దలుగొట్టింది. కరోనా మహమ్మారి తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డులకెక్కింది. సినిమా విడుదలైన 14వ రోజున రూ. 7.50 కోట్లు రాబట్టి మొత్తం కలెక్షన్లను రూ. 206.57 కోట్లకు పెంచుకుంది. అయితే, ఇప్పుడు మాత్రం వసూళ్లు కొంత నెమ్మదిస్తున్నాయి.

More Telugu News