Nikhil: ఫారిన్ లొకేషన్లలో 'కార్తికేయ 2' సందడి!

Karthikeya 2 movie update
  • గతంలో హిట్ కొట్టిన 'కార్తికేయ'
  • ముగింపు దశలో సీక్వెల్ షూటింగ్ 
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ 
  • త్వరలోనే అప్ డేట్ ఇస్తామన్న టీమ్

మొదటి నుంచి కూడా నిఖిల్ విభిన్నమైన .. విలక్షణమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. కొత్తదనానికి ఆయన ఇచ్చే ప్రాధాన్యతే ఆయనను ఇంతవరకూ నిలబెట్టింది. గతంలో ఆయన చేసిన 'కార్తికేయ' భారీ విజయాన్ని నమోదు చేసింది. దాంతో 'కార్తికేయ 2' పేరుతో ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ ను చేస్తున్నారు.

చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, విశ్వప్రసాద్ .. వివేక్ కూచిభొట్ల .. అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను హిమాచల్ ప్రదేశ్ లో చిత్రీకరించారు. అలాగే స్పెయిన్ .. పోర్చుగల్ లోని అందమైన లొకేషన్స్ లో షూట్ చేస్తూ వస్తున్నారు. 

త్వరలోనే  ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను వదలనున్నట్టు చెబుతూ, ఒక ఫోటోను షేర్ చేశారు. కాలభైరవ  సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా అలరించనుంది. నిఖిల్ - అనుపమ కాంబినేషన్లో '18 పేజెస్' రూపొందుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News