TET: తెలంగాణలో 'టెట్' నోటిఫికేషన్ విడుదల

  • జూన్ 12న టెట్ నిర్వహణ 
  • ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 12 వరకు దరఖాస్తులు
  •  టెట్ పూర్తయితే ఉపాధ్యాయ నియామకాలపై ప్రకటన వచ్చే చాన్స్!
TET Notification released in Telangana

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు నోటిఫికేషన్ విడుదల చేశారు. జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా టెట్ నిర్వహించనున్నారు. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 12 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇటీవలే సీఎం కేసీఆర్ ఉద్యోగ నియామకాలపై స్పష్టమైన ప్రకటన చేయడం తెలిసిందే. 

తెలంగాణలో 13,086 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే టెట్ నిర్వహణకు విద్యాశాఖకు ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరైనట్టు తెలుస్తోంది. కాగా, టెట్ పూర్తయితే టీచర్ నియామకాల ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News