సామూహిక హత్యల వెనుక ఏదో పెద్ద పన్నాగమే ఉంది: మమతా బెనర్జీ
- పశ్చిమబెంగాల్ లో ఓ గ్రామంలో హింసాకాండ
- టీఎంసీ నేత హత్య
- హత్య అనంతరం గ్రామంలో అల్లర్లు
- 8 మంది సజీవదహనం
- భోగ్తుయి గ్రామంలో పర్యటించిన మమత
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజకీయ హింసను, అరాచకత్వాన్ని బీజేపీ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. దీనివెనుక ఏదో పెద్ద కుట్ర దాగి ఉందని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ హింసకు కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాదు, అక్కడికక్కడే ఓ పోలీసు ఉన్నతాధికారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హింసాత్మక చర్యలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను శిక్షించాలంటూ మమత స్పష్టం చేశారు.
కాగా, భోగ్తుయి గ్రామంలో చోటు చేసుకున్న అల్లర్లలో దహమైన ఇళ్ల మరమ్మతులకు రూ.2 లక్షల చొప్పున ప్రకటించారు. తొలుత మమత రూ.1 లక్ష ప్రకటించగా, ఆ మొత్త సరిపోదని బాధిత కుటుంబాలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో, ఆ మొత్తాన్ని రూ.2 లక్షలు చేశారు.