Devineni Uma: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వీడియోను పోస్ట్ చేసిన దేవినేని ఉమ

Devineni Uma slams ycp
  • కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం 
  • ట్రాఫిక్ లేని సమయంలో లారీ ఢీ
  • సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనబడిందన్న దేవినేని ఉమ‌
కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయ‌డం క‌ల‌క‌ల రేపింది. గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలంలోని మచిలీపట్నం-కల్లూరు జాతీయ రహదారిపై ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దీనిపై టీడీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. ఉద్దేశ‌పూర్వ‌కంగానే లారీతో ఢీకొట్టించి పడేశారనే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. దీనిపై స్పందించిన టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు విగ్ర‌హాన్ని లారీ ఢీ కొట్టిన వీడియోను పోస్ట్ చేశారు. 

'గుడ్లవల్లేరులో ఉదయం ట్రాఫిక్ లేని సమయంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని లారీ ఢీ కొట్టింది. సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనబడింది. ఇసుక మాఫియా విగ్రహ ధ్వంసానికి పాల్పడింది. విధ్వంస సూత్రధారులు, వెనక ఉన్న పాత్రధారులను వెంటనే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలి' అని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.
Devineni Uma
YSRCP
Telugudesam

More Telugu News