Mamata Banerjee: ప్రముఖ బెంగాలీ నటుడు అభిషేక్ మృతి.. ఆవేదన వ్యక్తం చేసిన మమతా బెనర్జీ!

  • నిన్న రాత్రి తుదిశ్వాస విడిచిన అభిషేక్ ఛటర్జీ
  • 100కు పైగా సినిమాల్లో నటించిన అభిషేక్
  • సినీ, టీవీ రంగాలకు తీరని లోటు అన్న మమత
Mamata Banerjee pays condolences to Abhishek Banerjee

బెంగాలీ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ బెంగాలీ నటుడు అభిషేక్ ఛటర్జీ నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 58 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే మరణానికి గల అసలు కారణాన్ని మాత్రం ఆయన కుటుంబసభ్యులు వెల్లడించలేదు. 

1985లో 'పాత్ భోలా' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అభిషేక్ 100కు పైగా సినిమాల్లో నటించారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, సీరియల్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన మరణంతో బెంగాలీ చిత్ర పరిశ్రమ ఆవేదనలో మునిగిపోయింది. అభిషేక్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. 

మరోవైపు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అభిషేక్ ఛటర్జీ హఠాన్మరణం చెందారనే వార్త తనను కలచి వేసిందని అన్నారు. అభిషేక్ ఎంతో టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని కొనియాడారు. విలక్షణమైన నటనతో అందరినీ అలరించారని చెప్పారు. ఆయన మరణం సినీ, టీవీ రంగాలకు తీరని లోటు అని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

  • Loading...

More Telugu News