Russia: భద్రతా మండలిలో ఉక్రెయిన్‌పై రష్యా తీర్మానానికి భారత్ గైర్హాజరు

India and 12 others abstain in UNSC on vote on Russian led draft resolution on Ukraine
  • భద్రతా మండలిలో రష్యాకు ఎదురు దెబ్బ
  • భారత్‌, మరో 12 దేశాల గైర్హాజరు
  • వీగిపోయిన తీర్మానం
ఉక్రెయిన్‌లో మానవతా సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రష్యా చేసిన తీర్మానానికి భారత్‌తోపాటు మరో 12 దేశాలు గైర్హాజరయ్యాయి. అయితే, సిరియా, ఉత్తర కొరియా, బెలారస్ మాత్రం రష్యా ముసాయిదా తీర్మానానికి ఆమోదం తెలిపాయి. దీంతో తీర్మానం ఆమోదానికి అవసరమైన 9 ఓట్లను రాకపోవడంతో రష్యా తీర్మానం వీగిపోయింది. 

ఈ తీర్మానానికి రష్యా, చైనా అనుకూలంగా ఓటు వేయగా, భారత్ సహా మిగిలిన భద్రతా మండలి సభ్యులు గైర్హాజరు కావడంతో వ్యతిరేక ఓటు వేసే దేశాలు లేకుండా పోయాయి. దీంతో తీర్మానం వీగిపోయింది. ముసాయిదా తీర్మానంపై 15 దేశాల భద్రతా మండలిలో ఓటు వేయాలని శాశ్వత, వీటో వెల్డింగ్ కౌన్సిల్ మెంబర్ రష్యా  పిలుపునిచ్చింది.

 మానవతా సిబ్బందితో సహా పౌరులు, మహిళలు, చిన్నారులతోపాటు హాని కలిగే పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు పూర్తిగా రక్షించబడాలని, కాబట్టి చర్చలు అవసరమని ఆ తీర్మానంలో రష్యా పేర్కొంది. అలాగే, వేగంగా, స్వచ్ఛందంగా, అడ్డంకులు లేకుండా వారిని తరలించడం కోసం కాల్పుల విరమణ, చర్చల కోసం పిలుపునిచ్చింది. ఈ దిశగా సంబంధిత పక్షాలు అంగీకరించాల్సిన అవసరాన్ని అందులో నొక్కి చెప్పింది. అయితే, తీర్మానం ఆమోదానికి అవసరమైన ఓట్లు లభించకపోవడంతో భద్రతా మండలిలో రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది.
Russia
Ukraine
UNSC
Resolution

More Telugu News