Telangana: తెలంగాణ‌లో మూడు కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్ల‌ నియామకం

three corporations in telangana gets chairmen
  • రావుల శ్రీధ‌ర్ రెడ్డికి విద్యా సంక్షేమం
  • మెట్టు శ్రీనివాస్‌కు రోడ్ల అభివృద్ధి
  • ఇషాక్‌కు మైనారిటీ ఫైనాన్స్‌
  • ఉత్త‌ర్వులు జారీ చేసిన ప్ర‌భుత్వం
తెలంగాణ‌లో మూడు కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్ల‌ను నియ‌మిస్తూ సీఎం కేసీఆర్ బుధ‌వారం నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం బుధ‌వారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ చేసింది. తాజా నియామ‌కాల్లో విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, తెలంగాణ రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ల‌కు చైర్మ‌న్లు నియ‌మితుల‌య్యారు.

తెలంగాణ విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా రావుల శ్రీధర్ రెడ్డి, 
తెలంగాణ రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా మెట్టు శ్రీనివాస్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana
KCR
Corporations

More Telugu News