Kalyan: 'ఆర్ ఆర్ ఆర్' టీమ్ చేతుల మీదుగా 'అధీర' టీజర్ రిలీజ్!

  • హీరోగా డీవీవీ దానయ్య వారసుడు 
  • 'అధీర' సినిమాతో తెరకి పరిచయం
  • సూపర్ హీరో కాన్సెప్ట్ తో సాగే కథ
  • దర్శకుడిగా ప్రశాంత్ వర్మ  
Adhira teaser released

మొదటి నుంచి కూడా దర్శకుడు ప్రశాంత్ వర్మ విభిన్నమైన కథలను తెరకెక్కిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సూపర్ హీరో కాన్సెప్ట్ తో తేజ సజ్జ హీరోగా 'హను మాన్' సినిమాను రూపొందిస్తున్నాడు. ఆ తరువాత సినిమాను కూడా ఆయన అదే జోనర్లో చేస్తుండటం విశేషం. ఈ సినిమాతో నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు కల్యాణ్ హీరోగా పరిచయమవుతున్నాడు.

ఈ సినిమాకి 'అధీర' అనే టైటిల్ ను ఖరారు చేశారు. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ వదిలారు. రాజమౌళి .. ఎన్టీఆర్ .. చరణ్ కలిసి ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో హీరో చిన్నప్పటి నుంచి తన శరీరంలో అరుదైన ఎలక్ట్రిక్ పవర్ ను కలిగి ఉంటాడు. పెద్దైన తరువాత ఆ శక్తినే అతను ఆయుధంగా చేసుకుంటాడు. 

ఒక సూపర్ హీరోగా ఆ శక్తిని ఉపయోగించి దుర్మార్గులను ఎదుర్కోవడం .. సామాన్యులను కాపాడటం చేస్తుంటాడు. టైటిల్ కి తగినట్టుగానే హీరోను చాలా పవర్ఫుల్ గా చూపించారు. ఇక మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. మొత్తానికి మరో బడా నిర్మాత ఫ్యామిలీ నుంచి ఓ హీరో వస్తున్నాడన్న మాట.

More Telugu News