YSRCP: కేంద్ర మంత్రి పురుషోత్త‌మ్ రూపాల‌తో వైసీపీ ఎంపీల భేటీ.. ఫిషింగ్ హార్బ‌ర్ల కోసం విన‌తి

ysrcp mps met union minister purushottam rupala
  • కేంద్ర మత్స్య శాఖ మంత్రితో ఎంపీల భేటీ
  • 9 ఫిషింగ్ హార్బ‌ర్ల నిర్మాణం కోరిన ఎంపీలు ‌
  • ఎంపీల విన‌తికి సానుకూలంగా స్పందించిన రూపాల‌
పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాలు ముగింపు ద‌శ‌కు చేరుకున్న ద‌రిమిలా.. ఏపీలోని ప‌లు స‌మ‌స్య‌ల ప‌రిష్కారం నిమిత్తం వైసీపీ ఎంపీలు వ‌రుస‌గా కేంద్ర మంత్రుల‌తో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా బుధ‌వారం వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ ఎంపీలు కేంద్ర మ‌త్స్య శాఖ మంత్రి పురుషోత్త‌మ్ రూపాల‌తో భేటీ అయ్యారు.

ఏపీలోని కోస్తా తీరంలో 9 ఫిషింగ్ హార్బ‌ర్ల నిర్మాణం, మ‌త్స్య శాఖ‌కు అందిన ఇత‌ర డిమాండ్ల‌ను నెర‌వేర్చాలంటూ వైసీపీ ఎంపీలు కేంద్ర మంత్రిని కోరారు. ఈ మేర‌కు స‌మ‌గ్ర వివ‌రాల‌తో ఓ విన‌తి పత్రాన్ని అంద‌జేశారు. త‌మ ప్ర‌తిపాద‌న‌కు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించార‌ని వైసీపీ ఎంపీలు తెలిపారు.
YSRCP
Vijay Sai Reddy
Purushottam Rupala

More Telugu News