KCR: బోయగూడ ప్రమాదంపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం

KCR Announce Rs 5Lakh exgratia to fire accident victims
  • ప్రమాదంలో 11 మంది సజీవ దహనం
  • మరో ఇద్దరి ఆచూకీ గల్లంతు
  • మృతదేహాలను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశం
సికింద్రాబాద్ బోయగూడలోని ఓ టింబర్, స్క్రాప్ దుకాణంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ ఘటనలో 11 మంది బీహార్ వలస కార్మికులు సజీవ దహనం కావడంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. వారి మృతదేహాలను బీహార్ పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమాద సమయంలో అందులో 15 మంది నిద్రిస్తుండగా ఇద్దరు వ్యక్తులు బయటపడ్డారు. 11 మంది మృతి చెందారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
KCR
Secunderabad
Bhoiguda
Fire Accident

More Telugu News