Congress: రాజకీయాలకు ఆజాద్ గుడ్‌బై?

  • సమాజంలో రాజకీయ పార్టీలు మార్పు తీసుకురాకపోతే  సామాజిక సేవా సంస్థలే బాధ్యత తీసుకోవాలి
  • నేను ఆ దిశగా అడుగులేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు  
  • సన్మాన సభలో ఆజాద్ వ్యాఖ్యలు
Political parties work to create divide on basis of religion said  Ghulam Nabi Azad

కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా? ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు ఊతమిస్తున్నాయి. ఆజాద్‌కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌కు చెందిన ఓ సంస్థ ఆయనను సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల నుంచి తప్పుకుని సామాజిక సేవా కార్యక్రమాల దిశగా అడుగులు వేయనున్నట్టు సంకేతాలిచ్చారు. 

సమాజంలో మార్పు తీసుకురావడంలో రాజకీయ పార్టీలు విఫలమైనప్పుడు సామాజిక సంస్థలే ఆ బాధ్యత తీసుకోవాలన్నారు. ఇందుకోసం తాను రాజకీయాల నుంచి తప్పుకుని సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటూ, ప్రస్తుతం తనలో అదే ఆలోచన ఉన్నట్టు చెప్పకనే చెప్పారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత ఆజాద్ త్వరలోనే రాజకీయాలకు గుడ్‌బై చెబుతారన్న ప్రచారం జోరందుకుంది.

More Telugu News