Hyderabad: ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయ్.. అప్రమత్తంగా ఉండండి: ఉత్తర తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్ జారీ

  • రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
  • భూపాలపల్లి జిల్లా కాటారంలో అత్యధికంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత
  • రాష్ట్రంలో పలుచోట్ల స్వల్పంగా వర్షాలు
Orange alert issued in North Telangana

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. వడదెబ్బల బారినపడే అవకాశం ఉందంటూ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో అత్యధికంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లాలోని బజార్‌హత్నూర్‌లో 20 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.

చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వరకు 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో నిన్న రాష్ట్రంలోని పలుచోట్ల స్వల్పంగా వర్షాలు కురిశాయి. వనపర్తి జిల్లా మిరాస్‌పల్లిలో అత్యధికంగా 1.3, పెబ్బేరులో 1.1, మహబూబ్‌నగర్‌లోని పర్పల్లిలో 1.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

More Telugu News