RRR: పవిత్ర వారణాసిలో ప్రత్యేక పూజలు చేసిన రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్

RRR team arrives Varanasi and offered prayers
  • ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆర్ఆర్ఆర్
  • జోరుగా ప్రచార కార్యక్రమాలు
  • దేశవ్యాప్తంగా రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ పర్యటనలు
  • కోల్ కతా నుంచి వారణాసి చేరుకున్న త్రయం

దాదాపు రూ.330 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆర్ఆర్ఆర్ కు ప్రచారం కల్పిస్తున్నారు. ఈ ఉదయం కోల్ కతాలో ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న ఈ త్రయం... సాయంత్రానికి పవిత్ర నగరం వారణాసి చేరుకుంది. సంప్రదాయ దుస్తులు ధరించిన రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ వారణాసిలో పవిత్ర గంగానదికి ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
.

  • Loading...

More Telugu News