Prakash Raj: ప్రధాని రెండు గంటలే నిద్రపోతారన్న మహారాష్ట్ర బీజేపీ చీఫ్.. అదొక జబ్బు అని పేర్కొన్న ప్రకాశ్ రాజ్

Prakash Raj counters Maharashtra BJP Chief Chandrakant Patil
  • మోదీ రోజులో 22 గంటలు పనిచేస్తారన్న చంద్రకాంత్ పాటిల్
  • అది ఇన్ సోమ్నియా అని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్య 
  • గొప్పలు చెప్పుకోవద్దని హితవు
  • ఆ జబ్బుకు చికిత్స చేయాలని సలహా
ఏ చిన్న అవకాశం దొరికినా చాలు ప్రధాని నరేంద్ర మోదీ పైనా, బీజేపీ నేతల పైనా నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పిస్తుంటారు. తాజాగా, ప్రధాని మోదీ రెండు గంటలే నిద్రపోతారని, ఒక రోజులో 22 గంటల పాటు ఆయన పనిచేస్తుంటారని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యానించారు. దీనిపై ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. 

"దయచేసి కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించండి. నిద్రపోలేకపోవడం అనేది ఓ జబ్బు. వైద్య పరిభాషలో దాన్ని ఇన్ సోమ్నియా అంటారు. దాని గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు... ఆ జబ్బుతో బాధపడుతున్న మీ నాయకుడికి చికిత్స అందించండి" అంటూ ట్వీట్ చేశారు. 
Prakash Raj
Narendra Modi
Insomnia
Chandrakant Patil
BJP

More Telugu News