Rahul Vijay: మేఘ ఆకాశ్ నుంచి రొమాంటిక్ ఎంటర్టైనర్!

Megha Akash new movie with new director
  • యూత్ లో మేఘ ఆకాశ్ కి మంచి క్రేజ్
  • ఈ రోజున కొత్త  సినిమా షూటింగ్ లాంచ్  
  • రొమాంటిక్ ఎంటర్టైనర్ జోనర్లో సాగే కథ
  •  కీలకమైన పాత్రలో రాజేంద్ర ప్రసాద్

మేఘ ఆకాశ్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్  ఉంది. అయితే సరైన హిట్ పడకపోవడం వలన, ఆమె కెరియర్ గ్రాఫ్ ఆశించిన స్థాయిని అందుకోవడం లేదు. క్రితం ఏడాది ఆమె నుంచి 'రాజ రాజ చోర' .. 'డియర్ మేఘ' ప్రేక్షకుల ముందుకు రాగా, మొదటి సినిమా హిట్ టాక్ తెచ్చుకోగా, రెండో సినిమా ఫరవాలేదనిపించుకుంది.

ఇక ఆల్రెడీ ఆమె చేసిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న 'రావణాసుర' లోను ఒక కథానాయికగా ఆమె కనిపించనుంది. ఇక ఆమె చేయనున్న మరో కొత్త సినిమా ఈ రోజున పూజా కార్యక్రమాలను జరుపుకుంది. రాహుల్ విజయ్ జోడిగా ఆమె ఈ సినిమాలో కనిపించనుంది. 

సుశాంత్ రెడ్డి - అభిషేక్ కోట నిర్మిస్తున్న ఈ సినిమాతో దర్శకుడిగా అభిమన్యు పరిచయమవుతున్నాడు. హైదరాబాద్ .. గోవాలలో జరిగే షెడ్యూల్స్ తో ఈ సినిమా పూర్తికానుంది. రాజేంద్రప్రసాద్ ఒక కీలకమైన పాత్రను పోషించగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో వెన్నెల కిశోర్ .. అర్జున్ కల్యాణ్ కనిపించనున్నారు.

  • Loading...

More Telugu News