CM Jagan: పవర్ లిఫ్టింగ్ ఆణిముత్యం షేక్ సాదియాకు రూ.5 లక్షల నజరానా ప్రకటించిన సీఎం జగన్

CM Jagan announces cash reward for power lifter Sheikh Sadia Almas
  • అంతర్జాతీయంగా సత్తా చాటుతున్న సాదియా
  • ఆసియా టోర్నీలో 3 స్వర్ణాలు కైవసం
  • హర్షం వ్యక్తం చేసిన సీఎం జగన్
  • సాదియాకు అభినందనలు తెలిపిన వైనం
అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి షేక్ సాదియా అల్మాస్ నేడు ఏపీ సీఎం జగన్ ను కలిసింది. తన తండ్రి షేక్ సందానీతో కలి ఆమె అసెంబ్లీలోని సీఎం చాంబర్ కు వచ్చింది. సాదియా సాధించిన విజయాల పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఆమెను మనస్ఫూర్తిగా అభినందించారు.

ఈ సందర్భంగా సాదియాకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల నజరానాను ముఖ్యమంత్రి ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పవర్ లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని సీఎం జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

షేక్ సాదియా అల్మాస్ స్వస్థలం మంగళగిరి. పవర్ లిఫ్టింగ్ పై మక్కువ పెంచుకున్న ఆమె తండ్రి ప్రోత్సాహం, మార్గదర్శనంలో అంతర్జాతీయంగా అనేక విజయాలు సాధించింది. గతేడాది టర్కీలో జరిగిన ఆసియా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సాదియా ఏకంగా 3 పసిడి పతకాలు, 1 రజతం సాధించడం విశేషం.
CM Jagan
Sheikh Sadia Almas
Power Lifting
Reward
Mangalagiri
Andhra Pradesh

More Telugu News