Vijay: భారీ రేటుకు 'బీస్ట్' తెలుగు హక్కులు!

  • విజయ్ హీరోగా 'బీస్ట్'
  • దర్శకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ 
  • సంగీత దర్శకుడిగా అనిరుధ్ 
  • ఏప్రిల్ 13వ తేదీన విడుదల   
Beast Movie Update

విజయ్ హీరోగా తమిళంలో 'బీస్ట్' సినిమా రూపొందింది. సన్ పిక్చర్స్ బ్యానర్స్ పై నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. విజయ్ సరసన నాయికగా మొదటిసారి పూజ హెగ్డే నటించిన ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. ఒక రోజు ముందుగానే రిలీజ్ చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. 
 
ఇక ఈ సినిమాను అదే టైటిల్ తో తెలుగులోను విడుదల చేయనున్నారు. తెలుగు అనువాద హక్కులకు భారీ రేటు పలికినట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు విజయ్ చేసిన 'మాస్టర్' సినిమా తెలుగు అనువాద హక్కులు 6  కోట్లకు అమ్ముడుపోగా 14 కోట్ల మేర వసూళ్లను రాబట్టి, మంచి లాభాలను అందుకుంది.  

అందువలన ఈ సారి ఈ సినిమా అనువాద హక్కులు 11 కోట్లు పలికినట్టుగా తెలుస్తోంది. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. సెల్వరాఘవన్ .. యోగిబాబు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

More Telugu News