Andhra Pradesh: జగన్ కు రాజీనామా లేఖలు పంపిన నాలుగు స్మార్ట్ సిటీల ఛైర్మన్లు

  • విశాఖ, తిరుపతి, ఏలూరు, కాకినాడ స్మార్ట్ సిటీ ఛైర్మన్ల రాజీనామా
  • ఇటీవలే స్మార్ట్ సిటీలను ప్రకటించిన ప్రభుత్వం
  • ఇంతవరకు నిధులు, కార్యాలయం, సిబ్బందిని కేటాయించని వైనం
Four smart cities chairmans sends resignations to Jagan

ఏపీలో అధికార వైసీపీలో కలకలం రేగింది. ఏకంగా నాలుగు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ఛైర్మన్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో విశాఖ స్మార్ట్ సిటీ ఛైర్మన్ గన్నమని వెంకటేశ్వరరావు, తిరుపతి ఛైర్మన్ పద్మజ నారుమళ్లి, ఏలూరు ఛైర్మన్ బొద్దాని అఖిల, కాకినాడ ఛైర్మన్ అల్లి రాజబాబులు ఉన్నారు. ఛైర్మన్లుగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి వీరు చాలా అసంతృప్తిగా ఉన్నట్టు చెపుతున్నారు. 

ఇటీవలే ఈ నాలుగు నగరాలను జగన్ సర్కారు స్మార్ట్ సిటీలను చేసింది. ఈ సిటీలకు ఛైర్మన్లను నియమించింది. అయితే వీటికి కార్యాలయాలు, సిబ్బంది, నిధులను మాత్రం ఇంత వరకు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో వీరు నలుగురు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను సీఎం జగన్ కు పంపించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More Telugu News